Posts

Showing posts from July, 2022

ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది

  ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను… నీ చిత్తంబికను…. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను… నీ చిత్తంబికను…. మరవను ఆహారంబును మరవను సంసార సుఖము మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ… మరవను ఆహారంబును మరవను సంసార సుఖము మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ… మరచెద సుజ్ఞానంబును మరచెద తత్త్వ రహస్యము మరచెద గురువును దైవము మాధవ నీ మాయ… మరచెద సుజ్ఞానంబును మరచెద తత్త్వ రహస్యము మరచెద గురువును దైవము మాధవ నీ మాయ…….. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను… నీ చిత్తంబికను…. విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి యాశలు విష్ణుడ నీమాయ విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి యాశలు విష్ణుడ నీమాయ విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను… నీ చిత్తంబికను…. తగిలెద బహ...

కమలాక్షు నర్చించు కరములు కరములు

 సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము కమలాక్షు నర్చించు కరములు కరములు-    శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ; సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు-   శేషశాయికి మ్రొక్కు శిరము శిరము; విష్ణు నాకర్ణించు వీనులు వీనులు-   మధువైరిఁ దవిలిన మనము మనము; భగవంతు వలగొను పదములు పదములు-   పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి; దేవదేవుని చింతించు దినము దినము; చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు; కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు; తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి. నాన్న గారు! కమలాల వంటి కన్నులు కల ఆ విష్ణుమూర్తిని పూజిస్తేనే అవి చేతులు; లేకపోతే చేతులు, చేతులు కావు; శ్రీపతి అయిన విష్ణుదేవుని స్తోత్రము చేస్తేనే నాలుక అనుటకు అర్హమైనది; కాకపోతే ఆ నాలుకకు సార్థకత లేదు; దేవతలను కాపాడే ఆ హరిని చూసేవి మాత్రమే చూపులు; ఇతరమైన చూపులకు విలువ లేదు; ఆదిశేషుని పానుపుగా కల ఆ నారాయణునకు మ్రొక్కేది మాత్రమే శిరస్సు; మిగిలిన శిరస్సులకు విలువ లేదు; విష్ణు కథలు వినే చెవులే చెవులు; మధు అనే రాక్షసుని చంపిన హరి యందు లగ్నమైతేనే చిత్త మనవలెను; పరమ భగవంతుడైన ఆయనకు ప్రదక్షిణము చేసేవి మాత్రమే పాదాలు; మిగతావి పాదాలా? కాదు....

మందార మకరంద మాధుర్యమున

7-150-సీ. మందార మకరంద మాధుర్యమునఁ దేలు  మధుపంబు బోవునే మదనములకు? నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు  రాయంచ జనునె తరంగిణులకు? లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు  కోయిల చేరునే కుటజములకుఁ? బూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక  మరుగునే సాంద్ర నీహారములకు? తే. నంబుజోదర దివ్య పాదారవింద చింత నామృత పాన విశేష మత్త చిత్త మే రీతి నితరంబుఁ జేర నేర్చు? వినుతగుణశీల! మాటలు వేయు నేల?"           తండ్రి హిరణ్యాక్షుడు “హరి గిరి అనకు” అన్నాడు. ప్రహ్లాదుడు నీతిశాలి కదా. గురువు చండామార్కులవారికి సమాధానం చెప్పాడు. వినుతగుణశీల అని సంబోధించాడు. ఆ సందర్భంలోది ఈ అమృత గుళిక. మాధుర్యానికే మాధుర్యం చేర్చే మధురాతి మధురమైన పద్యరత్న మిది మనసును మైమరిపింప జేసెడి మా పోతన్న సీసోత్తమం.             ప్రఖ్యాత చరితుడా! వినవయ్య నా మాట. ఎన్నో మాటల్లో చెప్పటం అనవసర మయ్య. ఎవని నాభి యందు సృష్టికర్త పుట్టిన పద్మం జనించిందో ఆ విష్ణుదేవుని దివ్యమైన పాదపద్మాలను ధ్యానించటంలోనే, ఆ అమృతం ఆస్వాదించటంలోనే సదా పరవశిస్తు ఉంటుంది నా మనస్సు. మరి మందార పూల మకరందంలోని మాధుర్యం మరిగి...