ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది

 ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది

నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను…
నీ చిత్తంబికను….

ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను…
నీ చిత్తంబికను….

మరవను ఆహారంబును మరవను సంసార సుఖము
మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ…
మరవను ఆహారంబును మరవను సంసార సుఖము
మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ…

మరచెద సుజ్ఞానంబును మరచెద తత్త్వ రహస్యము
మరచెద గురువును దైవము మాధవ నీ మాయ…
మరచెద సుజ్ఞానంబును మరచెద తత్త్వ రహస్యము
మరచెద గురువును దైవము మాధవ నీ మాయ……..

ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను…
నీ చిత్తంబికను….

విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు
విడువను మిక్కిలి యాశలు విష్ణుడ నీమాయ
విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు
విడువను మిక్కిలి యాశలు విష్ణుడ నీమాయ

విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును
విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును
విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ

ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను…
నీ చిత్తంబికను….

తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధంబుల
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా
తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధంబుల
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా

అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై
నగి నగి నను నీవేలితి నాకా యీ మాయ
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై
నగి నగి నను నీవేలితి నాకా యీ… మాయ…..

ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను…
నీ చిత్తంబికను….

ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను…
నీ చిత్తంబికను….

Comments

Popular posts from this blog

కమలాక్షు నర్చించు కరములు కరములు